
About Us
శ్రీ రమ్య స్పీచ్ & హియరింగ్ సెంటర్
మాటలు సరిగా పలకలేనివారికి వినికిడి బాధపడుచున్నవారికి .....
కోస్తా జిల్లాలోనే ప్రప్రథమంగా అత్యంతాధునిక కంప్యూటర్ పరిజ్ఞనంతో మీ సమస్యలకు పరిష్కారం
శ్రీమతి నందిపాటి సరోజినీ దేవి
స్పీచ్ థెరపిస్ట్ & ఆడియోలజిస్ట్
మన జనాభాలో 2 % మంది ప్రజలు వినికిడి సమ్యసలు మరియు వినికిడి సమ్యసల వలన మాటలు సరిగా పలకలేక బాధపడుతున్నారు.
తల్లి గర్భం నుంచే బిడ్డ శబ్దాలను గ్రహించడం తెలుసుకుంటుంది.బిడ్డ పుట్టిన తరువాత శబ్ద గ్రాహ్యత లోపం వలన మాటలు ఏ విధంగ పలకాలి అనేది బిడ్డకు తెలియదు.శబ్దం చేసినప్పుడు బిడ్డ నుండి సరైన ప్రతిస్పందన లేక పోతే ఆ బిడ్డకు వినికిడి లోపముందని గుర్తించాలి.
" మాటలు రావాలంటే పుట్టుక నుంచి చెవులు వినిపించి తీరాలి .పుట్టిన సంవత్సరం , రెండు సంవత్సరం లోపు చెవులు వినిపించకపోతే వారు తప్పని సరిగా మూగవారు అవుతారు" .
బిడ్డకు ఏమాత్రం వినిపించిన మొదటి రెండు సంవత్సరములో నే మాటలు రానప్పుడు బిడ్డ వినికిడి సమస్య ఎంతవరుకు వున్నది అన్ని పరీక్షించి తగిన శిక్షణ చిన్న వయస్సు లోనే ఇస్తే మాటలు త్వరగా వచ్చే అవకాశం చాల ఉన్నది.
స్కూలుకు వెళ్లే చిన్నారులు వినికిడి - మాట్లాడు సమస్యల మూలంగా ముఖ్యముగా తోటి వారిలో అవహేళన కు గురై తద్వారా మానసికంగా అభద్రతా భావనకు గురై తమ చదువులలో ఆసక్తి ,సామర్ధ్యం తగ్గి అన్నింటా వెనుక బడుతున్నారు . ఈ సమస్య ఉన్న చిన్నారులకు సరైన సమయములో శ్రద్ధ తీసుకొని చికిత్స చేయించకపోతే దాని ప్రభావం వారి భావి జీవితం ఫై పడి వారి వ్యక్తిత్వ వికాసానికి,ఎదుగుదలకు అడ్డంకి అవుతుంది.
వయసు వలన గాని లేక చెవి సంబంధమైన ఇతర వ్యాధుల వల్ల వినికిడి శక్తీ లోపించివారికి తగు పరీక్షలు చేసి అవసరం మేరకు హియరింగ్ ఎయిడ్స్ ఉపయోగించి వారి వినికిడి శక్తీ పెంపవచ్చు.
ఈ క్రింది సమస్యలకు " శ్రీ రమ్య స్పీచ్ & హియరింగ్ ఎయిడ్ సెంటర్ " నందు వివిధ రకముల పరీక్షలు మరియు చికిత్స - శిక్షణ సౌకర్యములు
1. చెవిటి తనం వలన వచ్చిన మూగతనం
2.నత్తి నత్తిగా మాట్లాడుట.
3.ఆడవారు మగ గొంతుకతో మాట్లాడటం
4.గ్రహణం మొర్రు వలన సరిగా మాట్లాడలేకపోవుట
5.పక్షవాత కారణముగా సరిగా మాట్లాడలేకపోవుట
6.అక్షరములు లేదా కొన్ని పాదములు తారుమారుగా పలుకుట
7.కీచుగొంతుక , బొంగురు గొంతుకతో మాట్లాడుట
8.మానసిక వికలంగత వలన సరిగా మాట్లాడలేకపోవుట
9.తొందరపాటు తనంతో మాట్లాడుట వలన,మాటలు వేగముగా మాట్లాడుటవలన,మాటలో స్పష్టత లోపించుట.
10.చిన్న వయసు నుండి వివిధ లోపముల వలన మాటలు సరిగా రాకపోవుట.
11. కాక్లియర్ ఇంప్లంట్ సర్జరీ చేయించుకున్న పిల్లలు చక్కగా మాట్లడుటకు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును
Sri Ramya Speech & Hearing Center
Deaf Mutes,Stammering,Puberphonia,Andriphonia,Speech Problems - Due to cleft Problem, Post Stroke Aphasia,Misarticulation,Harsh Voice & Hoarse Voice,Speech Problem due to Mental Retradation and Cerbal Palsy,Cluttering,Delay Speech & Language,Audio Verbal Training (AVT)
Sri Ramya Speech & Hearing Center
Rajamahendravaram
There is no Videos
| Monday | 10:00 Am-5:00 Pm |
| Tuesday | 10:00 Am-5:00 Pm |
| Wednesday | 10:00 Am-5:00 Pm |
| Thursday | 10:00 Am-5:00 Pm |
| Friday | 10:00 Am-5:00 Pm |
| Saturday | 10:00 Am-5:00 Pm |
| Sunday | Holiday |